హిందూపురం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి నందు సోమవారం ఏఐటియుసి శానిటేషన్ వర్కర్స్ యూనియన్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిశేట్టిపల్లి వినోద్ కుమార్, ఉపాధ్యక్షులు రవికుమార్, పట్టణ కార్యదర్శి మారుతి రెడ్డి, హాజరయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 19వ తేదీన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగే రాష్ట్ర మహాసభను విజవంతం చేయాలని కోరారు.