చిలమత్తూరు మండలం మొరంపల్లి గ్రామంలో శుక్రవారం ఘనంగా నవగ్రహాల పూజ, అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులంతా భక్తిశ్రద్ధలతో అక్కడికి చేరుకుని నవగ్రహాల పూజ, శివాలయంలో అభిషేకం చేశారు. అనంతరం అక్కడికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిలమత్తూరు హర్ష స్వామి, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.