కళ్యాణదుర్గం: వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి బ్రహ్మరథోత్సవం

53చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో శనివారం షష్టి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు చేసి ప్రత్యేక అలంకరణతో పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఆలయం నుంచి ఊరేగింపుగా రథోత్సవ వేదిక వద్దకు తీసుకువచ్చారు. వేద పండితుల మంత్రోచ్చారణతో ఉత్సవ విగ్రహాన్ని రథంలో ప్రతిష్ఠించారు. అనంతరం భక్తులు బ్రహ్మ రథోత్సవం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్