కళ్యాణదుర్గం: జనవరిలో శ్రీ చౌడేశ్వరిదేవి పంచ జ్యోతుల ఉత్సవం

64చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలో వెలసిన చౌడేశ్వరి దేవి అమ్మవారి పంచ జ్యోతుల ఉత్సవం జనవరి 16, 17వ తేదిలలో నిర్వహించేందుకు కుల పెద్దలు తీర్మానించినట్లు చౌడేశ్వరి దేవాలయం కమిటీ ఛైర్మన్ నాగరాజు ఆదివారం విలేఖరులకు తెలిపారు. ఈ సందర్భంగా రాయదుర్గం పట్టణంలోని తొగిటవీర క్షత్రియలను జ్యోతుల ఉత్సవానికి వచ్చి విజయవంతం చేయాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్