కళ్యాణదుర్గం: బర్త్ ధృవీకరణ పత్రం కోసం వేలల్లో వసూళ్లు?
ఆధార్ తరహాలో కేంద్ర ప్రభుత్వం విద్యర్థుల కోసం ప్రవేశపెట్టిన బర్త్ ధృవీకరణ పత్రం కోసం పంచాయితీ అధికారులకు రూ. 50లు చలనా కట్టాల్సి ఉంది. అయితే కంబదూరు మండలంలోని పంచాయతీ కార్యదర్శులు రూ. 1000లు నుంచి రూ. 3000లు వరకు వసూలు చేస్తున్నారని శుక్రవారం విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులు దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.