రాప్తాడు నియోజకవర్గం చెన్నే కొత్తపల్లి మండలంలో శనివారం "ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం" నిర్వహించబడింది. వైద్య సిబ్బంది గ్రామంలో పర్యటించి, భారీ వర్షాల వల్ల కలిగిన మురుగునీటి నిల్వలు దోమల స్థావరాలను ఏర్పరచి, డెంగి, మలేరియా వంటి వ్యాధుల ప్రమాదంపై ప్రజలను అవగాహన కల్పించారు. ప్రజలు మురుగునీటి నిల్వలను తొలగించి, వేపాకు పొగ పెట్టుకోవాలని సూచించారు. అనంతరం, వైద్య పరీక్షలు చేసి మందులను అందజేశారు.