అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వం ద్యేయం అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. మంగళవారం పెనుకొండ నగర పంచాయతీలోని 12, 13 వ వార్డులలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పెన్షన్ లను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో కమీషనర్ శ్రీనివాసులు, టౌన్ కన్వీనర్ శ్రీరాములు, మహిళా అద్యక్షురాలు రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.