రాప్తాడు నియోజకవర్గం చెన్నే కొత్తపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు ఎస్ఐ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8, 9, 10 తరగతుల విద్యార్థినీ విద్యార్థులకు సత్ప్రవర్తన క్రమశిక్షణ మద్యపానం, ధూమపానం మంచి స్నేహితులతో పరిచయం బాల్య వివాహాలు ట్రాఫిక్ నిబంధనలు వంటి వాటిపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు.