రాప్తాడు నియోజకవర్గ చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని సివిల్ సప్లయర్స్ గోడౌన్ ను శనివారం ధర్మవరం రెవెన్యూ డివిజనల్ అధికారి మహేష్ తనిఖీచేశారు అందులో నిలువ వున్న సరుకులను పరిశీలించారు. సిబ్బందికి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. సరఫరాలో ఎటువంటి నిర్లక్ష్యము వహించకుండా ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేత పరచడానికి అధికారులందరూ సమన్వయంతో పని చేయలని సూచించడమైనది.