శింగనమల మండలం కల్లుమడి గ్రామ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను గురువారం పట్టుకున్నట్లు సీఐ కౌలుట్లయ్య తెలిపారు. వాహనాలు తనిఖీ నిర్వహించగా అనుమతి లేకుండా తరలిస్తున్నట్లు బయట పడిందని తెలిపారు. ఇసుక ట్రాక్టర్ ను పోలీస్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.