పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడులో చంద్రమోహన్(37) అనే చేనేత కార్మికుడు ఆదివారం అప్పుల బాధ తాళలేక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై చిన్నరెడ్డప్ప తెలిపారు. రెండేళ్ల కిందట మృతుడి భార్య అనారోగ్య కారణంగా మృతి చెందగా రెండో వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు సంతానం అనంతరం కుటుంబానికి చేనేత మగ్గం నిర్వహణకు సుమారు రూ. 6 లక్షల వరకు అప్పులు చేశాడు. వీటిని ఎలా తీర్చాలని మనోవేదనకు గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు.