తాడిపత్రి: పేద ప్రజల ఇళ్ల స్థలాల పై దయ చూపండి

59చూసినవారు
పేద ప్రజల ఇళ్ల స్థలాలపై దయ చూపండి అంటూ సీపీఐ నాయకులు తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన చేపట్టారు. తాడిపత్రి పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ రజాక్ వలీకి సీపీఐ పట్టణ అధ్యక్షుడు చిరంజీవి యాదవ్ వినతిపత్రం అందజేశారు. సచివాలయంలో ఇళ్ల స్థలాల కోసం పేదలు అర్జీలు ఇచ్చినా ఇవ్వలేదన్నారు. స్థలాలు ఇవ్వకపోతే రిలే దీక్షలు చేపడతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్