తాడిపత్రి పట్టణంలోని మెయిన్ బజార్ లో వెలసిన శ్రీకన్యకాపరమేశ్వరిదేవి అమ్మవారిశాలలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు శ్రీగాయత్రిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా ఉదయం అర్చకులు అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అమ్మవారిని శ్రీగాయత్రిదేవిగా అలంకరించారు. పెద్దఎత్తున భక్తులకు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు.