తాడిపత్రి నియోజకవర్గం ఓబులేసు కోనలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో శుక్రవారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని గరుడ వాహనంపై ఊరేగించారు. అనంతరం ఆలయ అర్చకులు, భక్తులు ప్రాకార మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.