సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకే వార్డుల్లో పర్యటిస్తున్నట్లు ఎమ్మెల్యే జేసి. అస్మిత్ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం తాడిపత్రి పట్టణంలోని పోరాట కాలనీలో అధికారులతో కలసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు డ్రైనేజీలు, వీధిలైట్ల సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలు పరిష్కరించాలని అక్కడే ఉన్న కమిషనర్ శివరామకృష్ణ, విద్యుత్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.