తాడిపత్రి మండలంలో మహిళ కిడ్నాప్ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. గన్నెవారిపల్లికి చెందిన రేణుకను స్కార్పియో వాహనంలో కిడ్నాప్ చేసి బంగారాన్ని దోచుకెళ్లిన ఘటనలో శుక్రవారం నలుగురిని అరెస్ట్ చేశారు. 3.2 తులాల బంగారం స్వాధీనం చేసుకుని స్కార్పియో వాహనాన్ని సీజ్ చేశారు. నిందితులను రిమాండుకు తరలించినట్లు సీఐ గంగాధర్ రెడ్డి తెలిపారు.