తెదేపా కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, అందరికీ అండగా నిలబడతానని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పేర్కొ న్నారు. శుక్రవారం అనంతపురంలోని జేసీ నివాసం నుంచి సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని మాట్లాడారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఆనందం కంటే పార్టీ గెలుపునకు కృషి చేసిన అనేక మంది
తెదేపా శ్రేణులు జైలులో ఉన్నారనే బాధే ఎక్కువగా ఉందన్నారు. త్వరలోనే జైలు నుంచి టిడిపి కార్యకర్తలు బయటికి వస్తారని ఆయన తెలిపారు.