ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తే చర్యలు తప్పవు వజ్రకరూరు ఎస్ఐ నాగస్వామి హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం వజ్రకరూరు సమీపంలో ఎస్ఐ ఆటోలను తనిఖీ చేశారు. ఎస్ఐ మాట్లాడుతూ కొనకొండ్ల, ఉరవకొండ ప్రధాన రహదారిపై ప్రత్యేకించి ఓవర్ లోడింగ్ ఆటోలపై నిఘా ఉంచినట్లు తెలిపారు. అధిక లోడుతో వెళుతున్న ఆటో డ్రైవర్లకు, కూలీలకు అవగాహన కల్పించారు. అధిక లోడుతో వెళితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.