ఉరవకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డిపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉండగా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయని, దీంతో రాకపోకలు స్తంభించి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని టీడీపీ మండల కార్యదర్శి గోవిందు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు 16మందిపై కేసు నమోదు చేశారు.