భారత విద్యార్థి ఫెడరేషన్ ఆం. ప్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు జనవరి 5వ తేదీన ఉరవకొండ పట్టణ గవర్నమెంట్ హై స్కూల్ నందు ప్రజ్ఞా వికాసం పరీక్ష నిర్వహించడం జరుగుతుందని ఎస్ఎఫ్ఐ, యుటిఎఫ్ సంఘాల నాయకులు తెలిపారు. శనివారం స్థానిక ఉరవకొండ పట్టణంలో హైస్కూల్ నందుపరీక్షకు సంబందించిన కరపత్రాలను ఆవిష్కరించారు.