పోలీసులు మరియు ఆర్టీఏ అధికారులు సంయుక్తంగా వజ్రకరూరు-గుంతకల్లు రహదారిపై రోడ్డుభద్రతా అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. వజ్రకరూరు ఎస్సై నాగస్వామి వాహన చోదకులకు రోడ్డు సేఫ్టీ నిబంధనలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడమే కాకుండా, మద్యం తాగి వాహనాలు నడపరాదని చెప్పారు. ప్రతి వాహనదారుడు రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉండాలి అని తెలిపారు.