ఉరవకొండ: పాఠశాల పై చర్యలు తీసుకోవాలని వినతి
ఉరవకొండ పట్టణంలో ఉన్నటువంటి గురు సాయి ఇంగ్లీష్ మీడియం ప్రవేటు పాఠశాల పై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ విభాగ్ కన్వీనర్ నిఖిల్ ఉరవకొండ ఎంఈఓ కు సోమవారం వినతిపత్రం అందజేశారు. అయన విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థుల జీవితంతో ఆటలు ఆడుతున్నారని విద్య బోధించే ఉపాధ్యాయులకు సరైన అర్హత లేదని, సరైనటువంటి మౌలిక వసతులు, అదేవిదంగా ఓకే వ్యాన్ లో పదుల సంఖ్యలో విద్యార్థుల ను తరలిస్తున్నరని పేర్కొనారు.