పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలు పూజించడం వల్ల జల కాలుష్యం కాకుండా పరిరక్షించాలని..అమ్మ దేవస్థానం నిర్మాణ కర్త శ్రావణ్ కుమార్ అన్నారు. మంగళవారం ఆమదాలవలస మండలం
చీమలవలస గ్రామంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేపట్టారు. అమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో.. ఈ ఏడాది 20 వేల విగ్రహాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఆమదాలవలస, సరుబుజ్జిలి, శ్రీకాకుళం, బూర్జ, పొందూరు మండలాలతో పాటు మరి కొన్ని ప్రాంతా కూడళ్ల వద్ద వాహనంతో వెళ్లి భక్తులు పంపిణీ చేస్తామని అన్నారు.