బూర్జ మండల కేంద్రంలో గల స్థానిక ఉన్నత పాఠశాల ఎదురుగా ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో గల బోరు నుంచి శనివారం
విద్యార్థులు నీటిని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నీటిని విద్యార్థులకు త్రాగేందుకు లేదా ప్లేట్లు శుభ్రం చేసుకునేందుకు అని అనుకుంటే పొరపడినట్లే. పాఠశాలలో జరుగుతున్న సిమెంట్ పనుల కోసం ఈ నీటిని వినియోగిస్తున్నట్లు
విద్యార్థులు చెప్పుకుంటున్నారు. విద్యాశాఖ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే