జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో కొర్లకోట నేతాజీ టీం

72చూసినవారు
జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో కొర్లకోట నేతాజీ టీం
జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు కంచిలి మండలం భోరిగాం గ్రామంలో ఈనెల 13, 14, 15న జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి 25 జట్లు పాల్గొన్నాయి. ఆముదాలవలసకు చెందిన కొర్లకోట నేతాజీ యూత్ టీం విజేతగా నిలిచింది. మొదటి బహుమతిగా రూ. 10 వేలు అందుకున్నారు. అలాగే ఎల్. కొత్తూరు రన్నర్గా నిలవగా వారికి రూ. 7 వేలు అందజేశారు. దీంతో సోమవారం నేతాజీ విషయాన్ని స్థానిక విలేకరులకు సమాచారం అందించారు. అలాగే కబాడీ క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్