ఆమదాలవలస మండలం దూసి రైల్వే స్టేషన్ ను ఆనుకొని ఉన్న రెండు ఎకరాల స్థలంలో మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమ స్మారకస్థలి అభివృద్ధికి ముందడుగు పడిందని ఇంటాక్ సభ్యులు పొన్నాడ రవికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ప్రతిపాదన అందించామని అన్నారు. జిల్లా కలెక్టర్ కు, రైల్వే వాల్తేరు డివిజన్ డిఆర్ఎమ్ కు మంత్రి పలు సూచనలు చేశారని అన్నారు.