ఆముదాలవలస మండలంలో మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో.. రహదారులు మరింత దారుణంగా తయారయ్యాయి. దీంతో గ్రామంలోకి వెళ్లే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో వేగంగా వస్తున్న వాహనాదారులకు గుంత కనిపించకపోవడంతో అదుపుతప్పి అందులో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు నిర్వహణ పనులు చేపట్టకపోవడంతో రోడ్డులు గోతులు ఏర్పడి పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని..వెంటనే సమస్యను పరిష్కరించాలన్నారు.