ఆముదాలవలస జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులు భర్తీ

58చూసినవారు
ఆముదాలవలస జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులు భర్తీ
ఆముదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ లెక్చరర్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ బి. శ్యాంసుందర్ ఒక ప్రకటనలో బుధవారం తెలిపారు. ఆంగ్లము, ఒకేషనల్ కామర్స్ సబ్జెక్టులో అధ్యాపకుల పోస్టులు ఖాళీ ఉన్నాయని అన్నారు. పీజీలో 50% మార్కులు కలిగి ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 23వ తేదీ సాయంత్రం నాలుగు గంటల లోగా దరఖాస్తులు కళాశాలలో అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్