సోంపేట మండలంలోని భూసాభద్రకు చెందిన మందపాటి రాజ్ కుమార్ (50) విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో గురువారం మృతి చెందారు. విశాఖపట్నంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వికలాంగుడైన రాజకుమార్ భూసాభద్రలో ఒంటరిగా నివసించేవాడు. రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంపై రాజ్ కుమార్ మృతదేహాన్ని గమనించిన రైల్వే పోలీసులు అతను వద్ద ఉన్న బస్సు పాస్, ఆధార్ కార్డులను చూసి సోంపేట పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు.