నరసన్నపేట మండలం నడగాం గ్రామంలోని స్థానిక అసిరి తల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఘనంగా పూజాది కార్యక్రమాలు చేపట్టారు. సోమవారం మార్గశిర మాసం తొలి పోలి పాడ్యమి సందర్భంగా అమ్మవారి సన్నిధిలో గీత యజ్ఞం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా నరసన్నపేట పట్టణానికి చెందిన శ్రీ లక్ష్మీనరసింహ భజన మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని సభ్యురాలు వారణాసి సంతోషి తెలిపారు.