ఆదివాసీలపై జరుగుతున్న దాడులు పట్ల ప్రభుత్వం జిల్లా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదివారం జలుమూరు మండలం మాకివలస ఎస్టీ గ్రామంలో శనివారం రాత్రి జరిగిన దాడిపట్ల ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కాషాయ వస్త్రాలలో వచ్చి హరే రామ హరే కృష్ణ సభ్యులు మహిళలపై విచక్షణారహితంగా దాడులు చేయడం సరికాదన్నారు.