హరిపురంలో గల శ్రీనాసా కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ లో ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్టు డైరెక్టర్ మద్దు భీమారావు మీడియా ముఖంగా తెలిపారు. సోంపేట, మందస, పలాస మండలాల విద్యార్థులకు ఈ శిక్షణ ఇస్తామన్నారు. నిరుద్యోగులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని శుక్రవారం కోరారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్, ఏడు బ్రిడ్జ్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఇచ్చి, ఉద్యోగావకాశాలు కల్పిస్తా మన్నారు. ఇంటర్ పాసై, 18 నుంచి 26 ఏళ్ల వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. జనవరిలో ప్రారంభమ య్యే ఈ శిక్షణ నెల రోజుల పాటు ఉంటుందన్నారు.