తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చునని మండల వ్యవసాయాధికారిణి బి. సంధ్య తెలిపారు. మంగళవారం హిర మండలం మండలంలోని తంప గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయాధికారిణి మాట్లాడుతూ రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలని తెలిపారు. వీటి వలన వ్యవసాయ సాగు సులభతరంగా దోహదపడుతుందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పై రైతులకు అవగాహన కల్పించారు.