తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చునని మండల వ్యవసాయ అధికారిణి బి సంధ్య తెలిపారు. గురువారం మండలములోని కిట్టాలపాడు గ్రామంలో ఏడవ వారం పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారిణి సంధ్య మాట్లాడుతూ గట్లపై బంతి, కంది మొక్కలు పెంపకం చేపట్టాలని సూచించారు. పంటకు చీడ పురుగులు, తెగుళ్లు నివారించవచ్చు చెప్పారు. రైతులు శాస్త్రవేత్తగా మారాలని తెలిపారు.