కొత్తూరు మండలం వనప కేజీబీవీ గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుక్రవారం స్థానిక పాఠశాలలో తనిఖీ చేసిన ఆయన మౌలిక వసతులు ఏ మేరకు ఉన్నాయో పరిశీలించారు. స్థానిక సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని విద్యార్థులకు అన్ని విధాల సహకరించాలని ఆయన సూచించారు. ఈ క్రమంలో మధ్యాహ్న భోజనంలో భాగంగా విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. మరింత రుచికరంగా ఉండాలని తెలిపారు.