మెలియాపుట్టి మండలం మర్రిపాడు కె, పరశురాంపురం, జాడుపల్లి, జోడూరు, గోకర్ణ పురం తదితర గ్రామాలలో మొదటి విడత సామాజిక తనిఖీ శుక్రవారం నుంచి వేగవంతంగా జరుగుతుంది. ఇదివరకే చెల్లించిన పెన్షన్లు, ఉపాధి హామీ వేతనాలు, అదేవిధంగా ఉపాధి హామీ పనులు, గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన ప్రభుత్వ భవన నిర్మాణాలను సైతం సామాజిక తనికి సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు.