పాతపట్నం: సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

64చూసినవారు
పాతపట్నం మండలంలోని సింగుపురం గ్రామంలో గ్రామీణ ఉపాధి పథకం నిధులుతో రూ. 25 లక్షలతో పూర్తి చేసిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం ప్రారంభించారు. అనంతరం గ్రామ ప్రజలతో కలిసి గ్రామంలో పర్యటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఆయన వెంట కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్