బ్రిటీష్ వారి పాలన నుంచి భారతావనికి విముక్తి కలిగించేందుకు ఎందరో మహనీయులు త్యాగాలు చేశారని ప్రధానోపాధ్యాయులు టి. మాధవరావు అన్నారు. గురువారం అదిఆంధ్ర ఎంపిపిఎస్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. బడుగు, బలహీన వర్గాలతో పాటు అట్టడుగు వారికి స్వాతంత్య ఫలాలు అందిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, మీనా, హరీష్, తదితరులు పాల్గొన్నారు.