శ్రీకాకుళం నగరంలోని స్థానిక ప్రభుత్వ ఐటిఐ కళాశాల నందు జిల్లా ఉపాధి కల్పనాధికారి సుధా ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో మూడు ప్రైవేట్ కంపెనీల యాజమాన్యాలు ఇంటర్వ్యూలు నిర్వహించగా. నిరుద్యోగ యువత 158 మంది హాజరయ్యారు. ఇందులో 48 మందికి ఎంపిక చేసి ఉపాధి కల్పించినట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొత్తలంక సుధా తెలిపారు.