ఉత్తరాంధ్ర జర్నలిస్ట్స్ ఫ్రంట్ (యూజేఎఫ్) 2024-25 హ్యాండ్ బుక్ ను రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ గురువారం రాజాంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మురళీమోహన్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో యూజేఎఫ్ అధ్యక్షులు డా. ఎం. ఆర్. ఎన్. వర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూజేఎఫ్ విజయనగరం జిల్లా ప్రతినిధులు వప్పంగి నాగేంద్ర, మజ్జి గణపతిరావు, రమేష్, జి. సూర్యనారాయణ పాల్గొన్నారు.