టెక్కలిలో ఈదురు గాలులతో వర్షం

72చూసినవారు
మండల కేంద్రం టెక్కలిలో శనివారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం ఎండ వాతావరణంలో ఉక్కుపోత ఉండగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారింది. దీంతో ఒక్కసారిగా ఈదురుగాలులతో వర్షం కురిసింది. టెక్కలి లోని ఎన్టీఆర్ కాలనీ, తొలుసురుపల్లి రోడ్డు, మెలియపుట్టి రోడ్డు ప్రాంతాల్లో వర్షపునీరు ప్రవహించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్