ఆమదాలవలస మండలం కట్యాచార్యుల పేట గ్రామపంచాయతీలో గురువారం గ్రామ సభ జరిగిందని స్థానికులు తెలిపారు. గ్రామాల అభివృద్ధి, పచ్చదనం పరిశుభ్రత తదితర విషయాల పట్ల ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సహకరించాలని సర్పంచ్ ఎన్ని రామచంద్రరావు కోరారు. గ్రామంలో గల వివిధ క్షేత్రస్థాయి సమస్యలను సచివాలయ అధికారులకు వివరించారు. గ్రామపంచాయతీ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పలు విషయాలపై చర్చించారు.