విద్యార్థి కుటుంబానికి రూ. 25లక్షలు ఎక్సగ్రేషియా ఇవ్వాలి
పాతర్లపల్లి పాఠశాల భవనం షన్ షేడ్ కూలి పదవతరగతి విద్యార్థి కృష్ణంరాజు మృతి చెందడం బాధాకరమని, విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం రూ. 25 లక్షలు పరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి. చందు, బి. హరీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. గురువారం పాతర్లపల్లి ఉన్నత పాఠశాలలో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలిపారు.