తంప గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
హిరమండలం మండలంలోని తంప గ్రామంలో బుధవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ మామిడి గణపతి ఆధ్వర్యంలో గ్రామంలో కూటమి నాయకులు ఇంటింటికి వెళ్లి మంచి ప్రభుత్వం కరపత్రాలు పంపిణీ చేశారు. అలాగే ఇంటికి మంచి ప్రభుత్వం స్టిక్లర్ల అంటించారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, జనసేన నాయకులు బోర్ర వినోద్, టిడిపి నాయకులు బొయితి తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.