ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలో 11 వ వార్డ్లోని కృష్ణసాగర్ చెరువును బాగు చేయాలని రైతులు అధికారులకు, నాయకులకు వినతి పత్రాలు ఆదివారం అందజేశారు. ఈ మేరకు వార్డ్ కౌన్సిలర్ ఆశి లీలా రాణి సమక్షంలో సాగుదారులు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సహాయంతో పాటు రైతులు, ప్రజలు కూడా చెరువు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆమె కోరారు.