కంచిలి మండలం జలంత్రకోట జంక్షన్ సమీప జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న 1033 నేషనల్ హైవే అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.