సోంపేట మండలం బారువ సముద్ర తీర ప్రాంతంలో గురువారం మెరైన్ ఎస్ఐ శిరీష పర్యాటకులకు అవగాహన కల్పించారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో చిన్నారులు, యువత బీచ్ లో స్నానాలు చేస్తున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె వివరించారు. పిల్లలతో బీచ్ కు వచ్చిన సమయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఈమెతో పాటు మెరైన్ సిబ్బంది ఉన్నారు.