వైసీపీ పాలనలో పాలకొండ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యే కళావతి రెండు కుటుంబాల కారణంగా పూర్తిగా వెనుకబడిందని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ అన్నారు. మంగళవారం సాయంత్రం పాలకొండలో జరిగిన శంఖారావం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇక్కడ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధిని మర్చిపోయారన్నారు. ఎక్కడ చూసిన భూకబ్జాలు, ఇసుక మాఫియాతో దండుకుంటున్నారన్నారు.