పలాస మండలం జగన్నాధపురంలో 10 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ శాఖ సీఐ మల్లికార్జున రావు, ఎస్సై షేక్ సైదా బి తెలిపారు. సోమవారం స్థానిక గ్రామంలో నాటు సారా అమ్ముతున్నట్లుగా సమాచారం రావడంతో దాడి చేశామన్నారు. ఈ దాడిలో 10 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకోగా అమ్ముతున్న నిమ్మన బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అతనిని అరెస్టు చేసి నరసన్నపేట కోర్టుకు తలలించగా రిమాండ్ విధించారని తెలిపారు.