భార్య మందలించిందని మనస్థాపంతో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పాతపట్నంలో చోటుచేసుకుంది. బాలాజీనగర్ లో నివాసముంటున్న శంకర్రావు (40)ను తాగుడు మానాలని భార్య రాజేశ్వరి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన శంకర్రావు సోమవారం కుమ్మరి వీధిలో ఉండే తల్లిగారింటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. మృతిడి భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.